15 April, 2026 | 8:29 AM

పట్టణాభివృద్ధికి కృషి చేయండి

18-02-2026 12:19 AM
  1. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు

మెదక్ నూతన మున్సిపల్ చైర్మన్ కానుగు రాధిక భూపతి రాజ్ కు అభినందన

మెదక్, ఫిబ్రవరి 17 (విజయ క్రాంతి) : మెదక్ పట్టణ అభివృద్ధికి కృషి చేయాలని మాజీ ఎ మ్మెల్యే, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మైనంపల్లి హన్మంతరావు నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్మన్ కానుగు రాధిక భూపతి రాజ్ కు సూచించారు. మంగళవారం మాజీ ఎమ్మెల్యే మైనం పల్లి హన్మంతరావు ను హైదరాబాద్ లోని ఆయన నివాసంలో మున్సిపల్ చైర్మన్ కానుగు రా ధిక భూపతి రాజ్ మర్యాద పూ ర్వకంగా కలిశారు.

వారికి శాలు వా, పూల మాలలవేసి ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా హన్మంతరావు మాట్లాడుతూ.. ప్రజల ఆశయాలకు అనుగుణంగా పని చేసి పట్టణ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. కొత్త పాలకవర్గానికి తన సంపూర్ణ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. తమ గెలుపులో హన్మంతరావు మార్గదర్శకం ఉందని, ఇందుకు చైర్మన్ దంపతులు వారికి ధన్యవాదాలు తెలిపారు.