calender_icon.png 1 October, 2025 | 11:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గెలుపే లక్ష్యంగా పని చేయాలి

01-10-2025 01:37:05 AM

స్థానిక ఎన్నికలపై మంత్రులకు సీఎం రేవంత్‌రెడ్డి సూచన 

హైదరాబాద్, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి) :  స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంత్రులకు సూచించారు. మంగళవారం మంత్రులతో  ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి,  పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌ డ్, ఏఐసీసీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జూమ్ మీ టింగ్ నిర్వహించారు. అక్టోబరు 5వ తేదీ నా టికి జడ్పీటీసీ అభ్యర్థుల ప్రతిపాదనలు సి ద్ధం చేయాలని పార్టీ అధిష్టానం నిర్ణయించినట్లు తెలిపారు. 

ప్రతి మండలం నుంచి ము గ్గురు పేర్లతో కూడిన  జాబితాను  అక్టోబర్ 5వ తేదీ నాటికి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు అందజేయాలని సూచించా రు.  అర్హులైన అభ్యర్థులను పీసీసీ ఎంపిక చేస్తుందని, ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ చిన్న పొ రపాటు కూడా జరగవద్దన్నారు.  సమావేశంలో ఇంచార్జ్ మంత్రులు ఆయా జిల్లాల  మంత్రులు, డీసీసీ అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నాయకలు పాల్గొన్నారు.