calender_icon.png 1 October, 2025 | 9:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక ఎన్నికల కోడ్ నియమావళి పాటించాలి

01-10-2025 01:37:24 AM

జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

జగిత్యాల అర్బన్, సెప్టెంబర్ 30(విజయక్రాంతి):స్థానిక ఎన్నికల కోడ్ నియమావళి ఖచ్చితంగా పాటించాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు.మంగళవారం కలెక్టరేట్ లో రాజకీయ పార్టీ ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సోమవారం నుండి ఎన్నికల నిబంధనలు అమలులో ఉన్నాయని, రాజకీయ పార్టీలకు సంబంధించిన గోడ వ్రాతలు, గోడ పత్రికలు, ప్లెక్సీ బ్యానర్లు తొలగించాలని ఆయా పార్టీల ప్రతినిధులను కోరారు.

ఎన్నికలు జరుగు ప్రాంతాల్లో అనుమతులు లేని సమావేశాలు నిర్వహించరాదన్నారు.ఎన్నికల నిబంధనలకు లోబడి అనుమతులు తీ సుకొని సమావేశాలు, గోడ వ్రాతలు, గోడ పత్రికలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు.రాజకీయ నేతల విగ్రహాలకు ముసుగులు వేయడం జరుగుతుందని తెలిపారు.

జిల్లా కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని,కంట్రోల్ రూమ్ నెంబర్,9666234383. కి ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులు చేయవచ్చన్నారు.అన్ని రాజకీయ వర్గాల ప్రతినిధులు ఎన్నికల నియమావాళి తూ. చ తప్పకుండ పాటించాలని సూచించారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ బి రాజా గౌడ్, జడ్పీ సీఈఓ గౌతంరెడ్డి, డిపిఓ మదన్మోహన్, సంబంధిత అధికారులు, పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.