01-10-2025 01:35:39 AM
హైదరాబాద్, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): మరోసారి ఉన్నత విద్యాసంస్థలన్నీ కాలేజీల బంద్‌కు సన్నద్ధమవుతున్నాయి. ఇంజినీరింగ్‌తో సహా ఇతర ప్రొఫెషనల్, డిగ్రీ, పీజీ కోర్సులను అందించే కాలేజీలకు రావాల్సిన పెండింగ్ ఫీజురీయింబర్స్‌మెంట్ బకాయిల్లో రూ.600 కోట్లను దసరా వరకు ఇస్తామని ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో కాలేజీలు బంద్‌ను విరమించుకున్నాయి.
అయితే పెండింగ్ నిధులు ఇంత వరకూ విడుదల చేయకపోవడంతో మళ్లీ బంద్‌కు వెళ్లాలని ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు యోచిస్తున్నాయి. ఇందుకు బుధవారం ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ (ఫతి) ప్రత్యేకంగా సమావేశమై భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నారు.
రెండు, మూడు నెలల దాకా నిధులు ఇవ్వలేమని ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలకు ప్రభుత్వం తెగేసి చెప్పినట్లు అసోసియేషన్ నేతలు తెలిపారు. ఈ క్రమంలోనే బుధవారం అత్యవరంగా సమావేశమై మధ్యా హ్నం తర్వాత కాలేజీల బంద్‌పై అధికారిక ప్రకటనను చేస్తామని ఫతి తెలిపింది. ప్రస్తుతం అన్ని కాలేజీలకు దసరా సెలవులు ఇచ్చేశారు. దీంతో దసరా సెలవులు ముగిసిన తర్వాత బంద్ పాటించే అవకాశముంది.