27 June, 2026 | 7:29 PM

Breaking News

నిజామాబాద్ జీపీవోపై గ్రామస్తుల ఫిర్యాదు   •   నిరుపేదల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ముఖ్య లక్ష్యం   •   క్యూబాపై అమెరికా ఆంక్షలు ఎత్తివేయాలి   •   సోనాల మండల కేంద్రంలో పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయండి   •   మొక్కలు నాటడం మున్సిపాలిటీ వంతు.. రక్షణ దేవుడి వంతు   •   జిల్లా బిజెపి (ఓబీసీ) రూరల్ అధ్యక్షులుగా మహేందర్ యాదవ్ ఎన్నిక   •   అంబర్పేటలో ఘనంగా డాక్టర్ గునిగంటి ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు   •   గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి   •   అరకొర వసతుల మధ్య సాంఘిక సంక్షేమ హాస్టల్ భవనాన్ని చూసి హాస్టల్లో రామంటున్న విద్యార్థులు   •   విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది   •  

ఇటుక బట్టిలో ట్రాక్టర్ బోల్తా.. కార్మికుడు మృతి

21-04-2026 06:14 PM

ఖమ్మం జిల్లాలో విషాదం

పెనుబల్లి,(విజయక్రాంతి): పెనుబల్లి మండలం మండాలపాడు గ్రామంలో జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పయాడు. ఇటుకల తయారీ కోసం ఇటుక బట్టి యాజమాని స్వయంగా ట్రాక్టర్ తో మట్టి దమ్ము చేస్తుండగా ట్రాక్టర్ అదుపుతప్పి తిరగబడింది. ఈ ప్రమాదంలో ఇటుక బట్టి యాజమాని పల్లాపు బజారు(57) మట్టిలో కూరుకుపోయి అక్కడికక్కడే మృతి చెందారు.

ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన స్థానికులు మట్టిలో కూరుకుపోయిన మృతదేహాన్ని అతి కష్టంతో బయటికి తీశారు.ఈ ఘటన గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి., మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.