19-02-2026 02:35:39 PM
సైకాలజిస్ట్ డాక్టర్ కె. పున్నం చందర్
రాజన్న సిరిసిల్ల,(విజయ క్రాంతి): రాజీవినగర్ లోని చేనేత పారిశ్రామిక సహకార సంఘంలో ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ కె. పున్నంచందర్ గ్రూప్ కౌన్సిలింగ్ ఏర్పాటు చేసినారు.ఈ సందర్భంగా పున్నంచందర్ మాటాడుతూ ప్రస్తుత వేగవంతమైన జీవన శైలిలో కార్మికులు తమ పనిలో నిమగ్నమై ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసే పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోందనీ ప్రముఖ సైకాలజిస్ట్ డా..కె . పున్నచందర్ తెలిపారు.
శారీరక శ్రమ, మానసిక ఒత్తిడి, అనారోగ్యకరపు ఆహార అలవాట్లు మరియు సరైన విశ్రాంతి లేకపోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు కార్మికుల్లో ఏర్పడుతున్నాయనీ అన్నారు. కార్మికులు తమ ఆరోగ్య పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం అవసరమని పేర్కొన్నారు.శారీరక ఆరోగ్యం మాత్రమే కాకుండా మానసిక ఆరోగ్యం కూడా సమానంగా ముఖ్యమని అన్నారు.నిరంతర ఒత్తిడి, ఆర్థిక భారం, కుటుంబ బాధ్యతలు వంటివి మానసిక సమస్యలకు దారితీసే అవకాశం ఉందనీ తెలిపారు. అలసట, నిద్రలేమి, చిరాకు, నిరుత్సాహం వంటి లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే నిపుణులను సంప్రదించాలి. కార్మికులు పాటించాల్సిన ముఖ్య సూచనలు చేశారు.సమతుల్య ఆహారం తీసుకోవడం రోజూ కనీసం 7–8 గంటల నిద్ర మద్యపానం, పొగ త్రాగడం వంటి అలవాట్లకు దూరంగా ఉండడం నిరంతర వైద్య పరీక్షలు చేయించుకోవడం యోగా, ధ్యానం వంటి పద్ధతులతో మానసిక ప్రశాంతత పెంపొందించుకోవాలని అన్నారు. పని సమయంలో భద్రతా నియమాలు పాటించడం యజమానులు కూడా తమ సంస్థల్లో ఆరోగ్య శిబిరాలు, కౌన్సెలింగ్ కార్యక్రమాలు నిర్వహించి కార్మికుల శారీరక–మానసిక ఆరోగ్యాన్ని కాపాడేందుకు సహకరించాలనీ అన్నారు. ఆరోగ్యవంతమైన కార్మికులు ఉంటేనే కుటుంబం, సంస్థ సమాజం అభివృద్ధి సాధ్యమవుతుందనీ తెలుపుతూ
ఆరోగ్యమే మహాభాగ్యం అనే నినాదాన్ని గుర్తుంచుకుని ప్రతి కార్మికుడు తన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనీ అన్నారు. కమ్యూనిటీ ఫెసిలిటేటర్ వేముల మార్కండేయ మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న థ్రిఫ్ట్ పథకం, నేతన్న బీమా, ప్రధానమంత్రి జీవిత సురక్ష బీమా, ప్రధానమంత్రి జీవన జ్యోతి లాంటి పథకాల్లో చేరి వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కమ్యూనిటీ ఫెసిలిటేటర్ వేముల మార్కండేయ, హెల్పింగ్ హార్ట్స్ వెల్ఫేర్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు అలువల ఈశ్వర్, అడ్వకేట్ దాసరి తిరుమల, చేనేత సహకార సంఘం అధ్యక్షుడు మేషం రాజయ్య, రవీందర్ కార్మికులు పాల్గొన్నారు.