15 April, 2026 | 7:57 AM

బస్వాపూర్ లో ఉచిత కంటి వైద్య పరీక్షల శిబిరం

19-02-2026 02:37 PM

భిక్కనూర్, ఫిబ్రవరి19,(విజయ క్రాంతి):భిక్కనూర్ మండలం బస్వాపూర్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షల శిబిరాన్ని గురువారం నిర్వహించారు. ఈ శిబిరంలో ఆర్బిఎస్కే డాక్టర్ మనోజ్, ఆఫ్తాల్మిక్ ఆఫీసర్ రవీందర్ పాటిల్ పాల్గొని విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి తగిన సూచనలు, చికిత్సపై అవగాహన కల్పించారు. విద్యార్థుల ఆరోగ్య సంరక్షణకు ఇలాంటి శిబిరాలు ఎంతో ఉపయోగకరమని ఉపాధ్యాయులు తెలిపారు.