కొనుగోలు కేంద్రం ప్రారంభించిన తాసిల్దార్
26-05-2026 04:12 PM
నిర్మల్ మే 26 (విజయ క్రాంతి): నిర్మల్ రూరల్ మండలంలోని మేడిపల్లి గ్రామంలో జొన్న కొనుగోలు కేంద్రాన్ని నిర్మల్ రూరల్ తాసిల్దార్ ప్రభాకర్ మంగళవారం ప్రారంభించారు. ప్రభుత్వం జొన్న పంట పండించిన రైతులకు ప్రభుత్వ మద్దతు ధర కల్పించేందుకు కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పి ఎస్ సి చైర్మన్ గంగాధర్ సర్పంచ్ ముత్తవ్వ సాయి రెడ్డి స్థానిక నాయకులు పాల్గొన్నారు.






