3 August, 2026 | 4:36 PM

తల్లిపాలే పుట్టిన బిడ్డకు శ్రీరామరక్ష

03-08-2026 04:01 PM

బోథ్,(విజయక్రాంతి): పుట్టిన బిడ్డకు తల్లిపాలు శ్రీరామరక్ష అని ముర్రిపాలు తాగితే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని సిడిపిఓ నర్సమ్మ పేర్కొన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ఎనిమిదవ అంగన్వాడీ కేంద్రంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... పుట్టిన బిడ్డకు ముర్రిపాలు తాపాలని పాలు పట్టకపోతే పుట్టిన బిడ్డ అనారోగ్యానికి గురవుతారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని అంగన్వాడి కార్యకర్తలు విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కురుమే అన్నపూర్ణ మహేందర్ ,సూపర్వైజర్ మౌనిక, ఉప సర్పంచ్ పుండు విజయ పదవ వార్డు సభ్యులు కట్ట భూమేష్ ఆరవ వార్డు సభ్యులు కరిపే శ్రీనివాస్ అంగన్వాడీ టీచర్లు ధనలక్ష్మి తో పాటు  పిల్లలు పాల్గొన్నారు