6 June, 2026 | 3:05 AM

ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం

06-06-2026 01:32 AM

కండ్లకోయ ఫారెస్ట్‌లో మొక్కలు నాటిన ఎంపీ ఈటల, ఎమ్మెల్యే మల్లారెడ్డి

మొక్కలు నాటిన అటవీశాఖ అధికారులు

మేడ్చల్ అర్బన్ జూన్ 5 (విజయక్రాంతి): ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలు.ప్రకృతి మనకు ప్రసాదించిన అమూల్యమైన సంపదను సంరక్షించడం ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకొని పచ్చదనాన్ని పెంపొందిస్తూ కాలుష్యాన్ని తగ్గించడంలో అందరు భాగస్వాములు కావాలని మేడ్చల్ నియోజకవర్గ శాసన సభ్యులు మాజీ మంత్రి వర్యులు చామకూర మల్లారెడ్డి పిలుపునిచ్చారు.

ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ సర్కిల్ గుండ్లపోచంపల్లి డివిజన్ పరిధిలోని కండ్లకోయ ఫారెస్ట్లో జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో భారీగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని  చేపట్టారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదిగా మల్కాజ్గిరి బిజెపి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ హాజరయ్యారు.ఈ సందర్భంగా మాజి మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి బీజేపీ ఎంపి ఈటల రాజేందర్ లు అటవీ ప్రాంతంలో మొక్కలు నాటి నీరు పోశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లారెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు బాధ్యతగా మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని అప్పుడే పర్యావరణాన్ని కాపాడుకోగలమని భవిష్యత్తు తరాలకు సురక్షితమైన వాతావరణాన్ని అందించగలమని చెప్పారు.నేటి సమాజంలో మనం నాటే ప్రతి మొక్క రేపటి తరాలకు ఆరోగ్యకరమైన జీవనానికి ఎంతగానో భరోసానిస్తుందని పేర్కొన్నారు.ఇలాంటి అద్భుతమైన పర్యావరణ సంరక్షణ కార్యక్రమంలో స్థానిక మాజి ప్రజా ప్రతినిధులు వివిధ శాఖల అధికారులు రాజకీయ నాయకులు అటవీ శాఖ అధికారులు,సిబ్బంద,పాఠశాల విద్యార్థిని  విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలను విజయవంతం చేశారు.

ఈ కార్యక్రమంలో ఎల్లంపేట్ మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీదేవి రమేష్ నాయక్.బిజెపి నాయకులు పట్లోళ్ల విక్రమ్ రెడ్డి.సుదర్శన్ రెడ్డి.అమరం మోహన్ రెడ్డి.దొడ్ల మల్లికార్జున్ ముదిరాజ్.బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు భాస్కర్ యాదవ్.గుండ్లపోచంపల్లి మున్సిపల్ మాజి వైఎస్ చైర్మన్ ధామన్నగారి ప్రభాకర్.మున్సిపల్ కౌన్సిలర్ సద్ది సురేష్ రెడ్డి.చిన్నోళ్ల భాస్కర్.మాజి పీఏసీఎస్ చైర్మన్ సింగిరెడ్డి రణధీర్ రెడ్డి.మాజి కోఆప్షన్ సభ్యులు అకిటి నవీన్ రెడ్డి.సుదర్శన్.రఘుపతి రెడ్డి.శంకర్.ఇటుకబట్టి రాజు నాయక్.తదితరులు పాల్గొన్నారు...