పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
ఎమ్మెల్యే కాలే యాదయ్య
మొయినాబాద్ జూన్ 5(విజయక్రాంతి): పేద మరియు మధ్యతరగతి కుటుంబాల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రతి అర్హ కుటుంబానికి ప్రభుత్వ సహాయం అందేలా నిరంతరం కృషి చేస్తున్నామని చేవెళ్ల ఎమ్మెల్యే శ్రీ కాలే యాదయ్య తెలిపా రు. మొయినాబాద్ మున్సిపాలిటీ కేంద్రం లోని రైతు వేదికలో మండలం, మున్సిపాలిటీ పరిధికి చెందిన లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ మరియు ముఖ్యమం త్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం గురువారం నిర్వహించారు.
ఈ కార్య క్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మె ల్యే కాలే యాదయ్య లబ్ధిదారులకు చెక్కుల ను అందజేశారు.ఈ సందర్భంగా 64 మం ది కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు రూ.64,01,024 విలువ గల చెక్కుల ను, అలాగే 22 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన రూ.10,60,000 విలువ గల చెక్కులను పం పిణీ చేశారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడు తూ, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సం క్షేమ పథకాలు పేద కుటుంబాలకు ఆర్థిక భ రోసా కల్పిస్తున్నాయని అన్నారు.
అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని తమ కుటుంబాల అభి వృద్ధికి ఉపయోగించుకోవాలని సూచించా రు. ప్రజల సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ ధ్యే యమని పేర్కొన్న ఆయన, భవిష్యత్తులో కూ డా అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వ స హాయం అందేలా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.






