జేకే ఓసీపీలో ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం
ఇల్లందు టౌన్, జూన్ 2౫ (విజయక్రాంతి): ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సింగరేణి జేకే ఓసీపీ పరిధిలోని ఖాళీ స్థలాల్లో శుక్రవారం మొక్కల నాటే కార్యక్రమాన్ని ఏరియా జనరల్ మేనేజర్ వి. కృష్ణయ్య మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. జేకే-5 ఓసీపీ ప్రాజెక్టు అధికారి జాకీర్ హుస్సేన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అధికారులు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు.
అనంతరం వి. కృష్ణయ్య సేవా సమితి సభ్యులకు జ్యూట్ బ్యాగులు, మొక్కలను పంపిణీ చేసి ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణహిత జీవన విధానాలను అలవర్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జేకే-5 ఓసీపీ మేనేజర్ పులి పూర్ణచంద్రరావు, పర్యావరణ అధికారి ఎన్. సతీష్ కుమార్, సేవా సమితి సెక్రటరీ సులక్షణ, సభ్యులు, అధికారులు, ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికులు పాల్గొన్నారు






