26 June, 2026 | 1:51 AM

ఫర్టిలైజర్ షాపులను తనిఖీ చేసిన ఏడీఏ

26-06-2026 01:10 AM

యూరియాకు ఇబ్బంది లేదు

కారేపల్లి, జూన్ 25 (విజయ క్రాంతి) కారేపల్లి మండలంలోని పెర్టిలైజర్ షాపులను గురువారం వైరా ఏడీఏ తుమ్మలపల్లి కరుణ శ్రీ తనిఖీ చేశారు. కారేపల్లి, సీతారాంపురం, కోమట్లగూడెం లో సోసైటీ ఫెర్టిలైజర్ సేల్ పాయింట్లు, గోమోర్ కేంద్రాన్ని ఏడిఏ తనిఖీ చేసి గొడౌన్ లో స్టాక్, పీవోఎస్ మిషన్, పెర్టిలైజర్ యాఫ్ లో స్టాక్ లను పరిశీలించారు.

స్టాక్ వచ్చిన వెంటనే పీవోఎస్ మిషన్ లో నమోదు చేయాలని ఆదేశించారు. ఈసందర్భంగా ఏడీఏ మాట్లాడుతూ రైతులకు యూరియాను అందుబాటులో ఉంచటానికి అన్ని సోసైటీ సేల్ పాయింట్లలో యూరియా నిల్వ ఉంచటం జరుగుతుందన్నారు. రైతులు వర్షాలు పడి భూమి నానిన తర్వాతనే విత్తనాలు విత్తుకోవాలని కోరారు. గ్రామాలకు వచ్చి విత్తనాలు అమ్మే వారి వద్ద విత్తనాలు కొనుగోలు చేసి మోసపోవద్దన్నారు. విత్తనాలు కొనుగోలు చేసిన రశీదులు పంట చేతికి వచ్చే వరకు దాచి పెట్టుకోవాలని సూచించారు. ఏడీఏ వెంట ఏవో బట్టు అశోక్ కుమార్, ఏఈవో నరేష్, సోసైటీ కార్యదర్శి బొల్లు హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.