23 May, 2026 | 7:07 PM

Breaking News

కొయ్యగుట్ట అమరవీరుల స్థూపానికి మరమ్మతులు చేపట్టండి   •   డబిల్ పూర్‌లో కాంగ్రెస్ వార్డు కౌన్సిలర్ ఆరిఫ్ పర్యటన   •   తాళం వేసి ఉన్న ఇల్లులే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్   •   తప్పులు మీరు చేసి నిందలు మాపై వేయడం సరికాదు   •   రామాయంపేటలో విషాదం.. బాధిత కుటుంబానికి కాంగ్రెస్ నేతల అండ   •   కష్టపడే కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుంది   •   ఎమ్మెల్యే మున్సిపాలిటీ లో ఎక్స్ టెన్షన్ కౌంటర్ గా మార్చారు   •   చట్టాలపైన అవగాహన లేకనే కేసుల్లో ఇరుక్కుపోతున్నారు   •   ఇతర రాష్ట్రాల కార్మికుల వివరాల నమోదు ప్రక్రియ ప్రారంభం   •   చోరీ కేసులో నిందితుడు అరెస్ట్.. బంగారం, వెండి వస్తువుల స్వాధీనం   •  

'ప్రపంచ రేబిస్ దినోత్సవం' వేడుకలు

28-09-2025 06:07 PM

హనుమకొండ (విజయక్రాంతి): హనుమకొండ జిల్లా పశువైద్య, పశు సంవర్ధక శాఖ పర్యవేక్షణలో బాలసముద్రంలోని పెట్ పార్క్ లో డాగ్స్ బ్రీడర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ రేబిస్ దినోత్సవ వేడుకలలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ ముఖ్య అతిథులుగా పాల్గొని రేబిస్ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజలలో పశుప్రేమ, పశు ఆరోగ్యంపై అవగాహన పెంపొందించాలన్న ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయం అన్నారు. రేబిస్ వంటి ప్రాణాంతక వ్యాధులపై ప్రజలకు సరైన సమాచారాన్ని అందించడం ద్వారా తగిన జాగ్రత్తలు తీసుకునే అవకాశం లభిస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు,అధికారులు,అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.