28-09-2025 06:04:13 PM
హనుమకొండ (విజయక్రాంతి): దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రోజు వేయి స్తంభాల దేవాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన అమ్మవారికి వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి వారి సతీమణి నాయిని నీలిమ రెడ్డి, కుమార్తె అల్లుడు డాక్టర్ నాయిని గోదా విష్ణు రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి సన్నిధిలో చండీ హోమం నిర్వహించారు. అనంతరం మహా అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతకు ముందు కుటుంబ సమేతంగా రుద్రేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు.