11 April, 2026 | 11:59 AM

Breaking News

పోటు రంగారావుపై NIA ఉపా చట్టం కేసు ఎత్తివేయాలి ‌‌   •   మంగళ్‌హాట్‌లో కార్డెన్ సెర్చ్— గ్యాస్ సిలిండర్లు, బైకులు స్వాధీనం   •   ముంబైలో ఘోర అగ్నిప్రమాదం— సిలిండర్ పేలుళ్లతో తీవ్ర భయాందోళన   •   కర్ణాటకలో యూత్ కాంగ్రెస్‌ నేత దారుణహత్య.. స్థానికుల్లో భయాందోళన!   •   జ్యోతిరావు పూలే జయంతి.. నివాళులర్పించిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ   •   కోదాడ జాతీయ రహదారిపై ఘోర బస్సుప్రమాదం... స్పాట్‌లో 36 మంది..!   •   బిక్కనూర్ వద్ద ఘోర రోడ్డుప్రమాదం – ఇద్దరు మృతి   •   ఐలాపూర్‌లో హైడ్రా కూల్చివేతలు   •   అమీన్‌పూర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్‌... హైకోర్టు లాయర్‌ ఫామ్‌హౌస్‌ కూల్చివేత   •   జీవితంపై విరక్తి చెంది ఇద్దరు యువకుల ఇద్దరు ఆత్మహత్య   •  

౩ నుంచి ప్రపంచ తెలుగు మహా సభలు

28-12-2025 12:00 AM

జనవరి 5న హాజరు కానున్న ఏపీ సీఎం చంద్రబాబు  

ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ గజల్ శ్రీనివాస్

అమరావతి, డిసెంబర్ 27: ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో వచ్చే జనవరి 3, 4, 5 తేదీల్లో శ్రీ సత్య సాయి స్పిరిచువల్ సిటీ  ప్రాంగణంలో ౩వ ప్రపంచ తెలుగు మ హా సభలు జరగనున్నట్లు ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ గజల్ శ్రీనివాస్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మూడవ రోజు జనవరి 5 వ తేదీ సాయంత్రం జరిగే సమాపనోత్సవానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  శ్రీ నారా చంద్రబాబు నాయుడు హాజరు కానున్నట్లు శ్రీనివాస్ తెలిపారు. తెలుగు మహా సభల ప్రత్యేక సంచిక ఆంధ్ర మేవ జయతే, అలాగే 3 వ ప్రపంచ తెలుగు మహా సభల పోస్టల్ కవర్ ను చంద్రబాబు విడుదల చేస్తారని సమన్వయ కర్తలు పి. రామచంద్ర రాజు, వాసిరెడ్డి విద్యా సాగర్‌లు తెలిపారు.