28-12-2025 12:10:48 AM
అస్సాంలో ‘సర్’ ఎఫెక్ట్
గౌహతి, డిసెంబర్ ౨7: అస్సాం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ఆ రాష్ట్రంలో ‘సర్’ చేపడుతున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ఎన్నికల సంఘం తాజాగా ఓటర్లజాబితా నుంచి రాష్ట్రవ్యాప్తంగా 10.56 లక్షల మంది పేర్లను తొలగించింది. వారు పోను ప్రస్తుతం ఓటర్ల జాబితాలో 2.51 కోట్ల మంది ఓటర్లు ఉన్నా రు. ఓటర్ల తొలగింపునకు ఎన్నికల సంఘం ప్రధానంగా మూడు అంశాలపై దృష్టి పెట్టిం ది.
ఒకటి.. మరణించిన వారి తొలగింపు, రెండు.. శాశ్వతంగా నివాసం మారిన వారి తొలగింపు, మూడు.. ఒకే వ్యక్తి పేరిట రెండుచోట్ల ఓటు హక్కు ఉంటే, ఒక చోటే పరి మితం. ఈ అంశాలపై గత నెల 22 నుంచి ఈనెల 20 వరకు బీఎల్వోలు ఇంటింటి సర్వే చేపట్టారు. అనంతరం ఈసీ ౧౦.౫౬ లక్షల ఓట్లను తొలగించింది.