25 April, 2026 | 3:28 AM

ఘనంగా ఆరాధన దినోత్సవం

25-04-2026 02:07 AM

ఆమనగల్లు, ఏప్రిల్ 24 (విజయక్రాంతి): భగవాన్ శ్రీ సత్య సాయి బాబా ఆరాధన దినోత్సవాన్ని భక్తులు అత్యంత ఘనంగా నిర్వహించారు. శ్రీ సత్య సాయి సేవ సమితి ఆధ్వర్యంలో సమితి అధ్యక్షులు దొంతు శ్రీను అధ్యక్షతన పలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ మేరకు సత్యసాయి మందిరంలో ప్రత్యేక  పూజలు జరిపారు. ఈ సందర్భంగా భక్తులు ఆలపించిన భజన కీర్తనలు సత్యసాయి నామస్మరణం మార్మోగింది. భక్తుల రాకతో మందిరం ఆవరణ కోలాహలంగా దర్శనమిచ్చింది.

చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని వర్గాల భక్తులు ఆరాధన దినోత్సవంలో పాలుపంచుకున్నారు.  అనంతరం ఆమనగల్లు ఆర్టిసి బస్టాండ్ ఆవరణలో ఏర్పాటుచేసిన నారాయణ సేవ (అన్న ప్రసాద వితరణ) కార్యక్రమాన్ని ఆమనగల్లు మున్సిపాలిటీ చైర్మన్ నేనావత్ పత్య నాయక్, కౌన్సిలర్లు పాపిశెట్టి రాము, ఎర్రవోలు మహేష్ పుల్లారెడ్డి అనూష శ్రీశైలం ల తో కలిసి ప్రారంభించారు. పెద్ద ఎత్తున భక్తులు ఆరాధన దినోత్సవం లో పాల్గొని సాయి బాబాను ప్రార్థించారు. కార్యక్రమంలో సమితి కమిటీ సభ్యులు డాక్టర్ దొంతు పుల్లయ్య, ఆమనగంటి సంజీవ్ కుమార్, గుర్రం సురేష్, పల్లె అల్లాజి గౌడ్, గాజుల శ్రీను, బ్రహ్మచారి, తిరుపతయ్య, దాస శ్రీను, జగన్మోహన్, ఆర్టిఏ శేఖర్, శ్రీశైలం,  పోలిశెట్టి శ్రీను, పోలిశెట్టి నందు, శ్రీధర్, నాగిళ్ల లింగం, నాగిళ్ల శంకర్, రాజ వర్ధన్ రెడ్డి, కృష్ణారెడ్డి, ఆలేటి నారాయణ సాగర్, రాము గోల్డ్,  ప్రభాకర్, ఆటో మల్లేష్,  గంజి వెంకటేష్, దొంతు సంధ్య, సృజన, శైలజ, అలివేలమ్మ, తదితరులు పాల్గొన్నారు.