గ్రామదేవతలకు పూజలు... ప్రజల్లో ఐక్యతను పెంపొందిస్తాయి
21-04-2026 07:39 PM
బిఆర్ఎస్ జిల్లా నాయకుడు మేకల అయ్యప్ప
జవహర్ నగర్,(విజయక్రాంతి): గ్రామదేవతలు ప్రజల్లో సామరస్యతను ఐక్యతను పెంపొందిస్తారని ఎల్లమ్మ తల్లి దీవెనలు ప్రజలందరిపై ఉండాలని బిఆర్ఎస్ జిల్లా నాయకుడు మేకల అయ్యప్ప అన్నారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ లోని గౌడ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవాన్ని పురస్కరించుకొని వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మేకల అయ్యప్ప హాజరై మాట్లాడుతూ భక్తి భావంతోనే ప్రజల్లో సుఖసంతోషాలు కలుగుతాయని ప్రతి ఒక్కరు అమ్మవారిని పూజించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్ గౌడ్, కృష్ణ గౌడ్, గౌడ సంఘం కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.






