తుర్కయంజాల్‌లోని ప్లాట్ల ఈ-వేలం
ప్రీ--బిడ్ సమావేశానికి ప్రజల నుంచి విశేష స్పందన
హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) తుర్కయంజాల్‌లోని 12 ప్లాట్ల ఈ--ఆక్షన్‌కి సంబంధించి ఈ నెల 17న నిర్వహించబో యే ఈ వేలం ప్రీ--బిడ్ సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. హెచ్‌ఎండీఏ ఎస్టేట్ మేనేజ్మెంట్ యూనిట్‌కు చెందిన డెప్యూటీ తహసీల్దార్ శ్రీకాంత్‌రెడ్డి వేల ప్రక్రియను వివరించారు.
ఎంఎస్‌టీసీ ప్రతినిధులు ఈ--ఆక్షన్ విధానం గురించి ప్రజెంటేషన్ ఇవ్వ గా, కేపీఎంజీ సంస్థ ప్రతినిధులు ఈ ప్రదేశం యొక్క వ్యూహాత్మక ప్రాముఖ్యత మరియు భవిష్యత్ అభివృద్ధి అవకాశాలను వివరించారు. ఈ సమావేశంలో ధన్మోహన్ సింగ్, ఈఈ, హెచ్‌ఎండీఏ, సత్యనారాయణ, అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్, హెచ్‌ఎండీఏ, కె శ్రీకాంత్‌రెడ్డి, పీఆర్వో, హెచ్‌ఎండీఏ, ప్లానిం గ్, ఇంజనీరింగ్ డివిజన్ సిబ్బంది పాల్గొన్నారు.






