12-11-2025 12:45:04 AM
అదనపు కలెక్టర్ భాస్కరరావు
యాదాద్రి భువనగిరి నవంబర్ 11 ( విజయక్రాంతి): జిల్లాలో డ్రగ్స్ మత్తు పదార్థాలు లేని జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు బాధ్యతయుతంగా కృషి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్ మినీ మీటింగ్ హాల్లో అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు, అడిషనల్ డీసీపీ లక్ష్మీనా రాయణ, భువనగిరి రెవెన్యూ డివిజనల్ అధికారి కృష్ణారెడ్డి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ కృష్ణమూర్తి , అన్ని విద్యాసంస్థల ప్రిన్సిపాల్, వైద్య ఆరోగ్యశాఖ, తదితర సంబంధిత విభాగాలతో కలిసి డ్రగ్స్ నిర్మూలన పై అదనపు కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుత యువత మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా ఉండేందుకు వారికి ముందస్తు అవగాహన సదస్సులు నిర్వహించి డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతయుతంగా తమవంతు కర్తవ్యాన్ని నిర్వహించా లని కోరారు. జిల్లాలో గంజాయి రవాణా సరఫరా చేసిన వారిని గుర్తించి (7) కేసులు నమోదు చేశామ న్నారు.
అన్ని విభాగాల సమన్వయంతో జిల్లాలో డ్రగ్స్, గుడుంబా, మాదకద్రవ్యాల నిర్మూలనకు కృషి చేయాలని ఆయన సూచించారు. జిల్లా అటవి శాఖ అధికారి పద్మజ, జిల్లా విద్యా శాఖ అధి కారి సత్యనారాయణ, జిల్లా ఇంటర్మీడియ ట్ అధికారిని రమణి, ప్రిన్సిపల్స్ సంబం ధిత అన్ని విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.