calender_icon.png 12 November, 2025 | 2:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హలో మాదిగ 17న చలో ఢిల్లీ

12-11-2025 12:46:19 AM

- చీప్ జస్టిస్ గవాయ్ పై జరిగిన దాడిని ఖండిస్తూ..

-డిల్లీ కి పిలుపు నిచ్చిన  మందకృష్ణ మాదిగ.

-ముంబై లో భవిష్యత్ కార్యాచరణ సమావేశం.

-మాదిగల సత్తా ఏంటో చూపిద్దాం.

ముస్తాబాద్, నవంబర్ 11 (విజయక్రాంతి): పద్మశ్రీ అవార్డ్ అందుకున్న తర్వాత మొదటిసారి  ముంబాయి వచ్చిన  మందకృష్ణ మాదిగ కు  మహారాష్ర్ట ఎమ్మార్పీఎస్ %ఞ% మాతంగ్  అరక్షన్ సంఘర్ష్ సమితి మాస్ తెలుగు మాదిగ మహాసంఘం,సంత్ చెన్నయ్య మాదిగ సేవా సంఫ్‌ు లకు చెందిన కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. సోమవారం మధ్యాహ్నం దాదర్ లో గల ఆంధ్రమహాసభ %ఞ% జింఖాన ఆడిటోరియంలో మాదిగల భవిష్యత్ కార్యాచరణ సమావేశానికి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ  మఖ్య అతిధిగా హజరయ్యారు.

ఈ కార్యక్రమంలో మహారాష్ర్ట ఇంచార్జ్  అజిత్ కేసల్కర్  ఆత్మీయ అతిధిగా పాల్గొనగా బహుజన సాహిత్య అకాడమీ మహారాష్ర్ట శాఖ అధ్యక్షుడు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం కొండాపూర్ గ్రామ వాస్తవ్యులు నాగెల్ల దేవానంద్ ఈ సభకు అద్యక్షత వహించారు. అనంతరం మందకృష్ణ మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి 78 సంవత్సరాలైనా ఈ సమాజం దలితులంటే ఇంకా చిన్న చూపే చూస్తుందన్నారు.దానికి ఉదాహరణ మొన్న  సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి  జస్టిస్ బి ఆర్ గవాయ్ పట్ల జరిగిన దాడే నిదర్శనమని దలితులు ఎంత పెద్దస్థాయికి ఎదిగినా వారి ప్రోటోకాల్ దొరకదు తగిన ప్రాధాన్యత ఇవ్వరని ఈ సందర్బంగా గుర్తు చేశారు.

ఇలాంటి సంఘటన లెన్నో అనేక చోట్ల అనేక రకాలుగా అవమానాలు జరిగాయని పేర్కొన్నారు.రాజకీయాల్లో ఉన్న ఎందరో  ప్రతీ రాష్ర్టం నుండి జాతీయ స్థాయిలో ఎదిగిన మన నాయకులు ఇలాంటి విషయాలపై సీరియస్ గా తీసుకోవాలన్నారు.జస్టిస్ గవాయ్ పై జరిగిన అన్యాయన్ని ఖండిస్తూ అందుకు కారణమైన వారికి కఠినంగా శిక్ష పడాలని  ఘటనపట్ల నిర్లక్ష్యం చూపుతున్న వ్యవస్థలకు తగిన గుణపాఠం చెప్పే వరకు మన పోరాటం ఆపవద్దని కోరుతూ..ఈ దేశానికి భారత రాజ్యంగం అందించిన ప్రపంచ మేధావి డాక్టర్ బాబా సాహేబ్ అంబేడ్కర్  నివసించిన ఈ గడ్డమీద నుండి మాటిస్తున్నా మీకు అండగా నేనుంటానని భరోసా కల్పించారు.

దలితుల ఆత్మగౌరవ ప్రదర్శన కోసం ఈ నెల 17 చలో డిల్లీ.. కార్యక్రమాన్ని ఎమ్మార్పీఎస్ ఆద్వర్యంలో దలితుల శక్తి చూపించి మాదిగల సత్తా ఏంటో చూపించాలన్నారు.ఈ కార్యక్రమంలో ముంబాయి ఎమ్మార్పీఎస్ ప్రతినిదులు ఎర్రోళ్ళ శంకర్, సంటి శంకర్ , కృష్ణ చెన్నారం, తెలుగు మాదిగ మహ సంఘం ముంబాయి అడ్వుజర్ కొమ్ము రంగరాజు,అద్యక్షుడు ఎరులా లక్ష్మన్ , ప్రధాన కార్యదర్శి  బాలకృష్ణ గంటాని  , సంత్ చెన్నయ్య మాదిగ సమాజ్ ధారావి. ప్రధాన కార్యదర్శి కృష్ణ జటల్ వార్ , వైస్ ప్రెసిడెంట్ అనిల్, క్యాషియర్ సోమ్ నాథ్ ఎరూర్, జాయింట్ సెక్రటరి రవి మరాఠి ప్రతినిధులు పాల్లొన్నారు.