యాదాద్రీశుడి ఆదాయం కోటి
ఒక్కరోజే 81 వేల మంది భక్తుల దర్శనం
కొండపైకి సరిపోని ఉచిత బస్సులు
మెట్ల మార్గంలో కొండపైకి భక్తులు
యాదాద్రి భువనగిరి, మే 26 (విజయక్రాంతి): ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి ఆదివారం రికార్డుస్థాయిలో 81 వేల మందికిపైగా భక్తులు తరలివచ్చారు. దీంతో ఆలయానికి ఒక్కరోజే రూ.1.02 కోట్ల ఆదాయం సమకూరినట్టు అధికారులు ప్రకటించారు. ఆలయ చరిత్రలో ఇది రికార్డు నిత్యాదాయంగా పేర్కొన్నారు. రద్దీకి అనుగుణంగా మౌలిక సదుపాయాలు లేకపపోవడంతో భక్తులు అవస్థలు పడాల్సి వచ్చింది. కిక్కిరిసిన క్యూలైన్లు, వాటిలో ఎయి ర్ కండిషన్ సిస్టమ్ పనిచేయక పోవడంతో చిన్నపిల్లలు, వృద్ధులు ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ధర్మ దర్శనానికి దాదా పు 4 గంటలకుపైగా నిరీక్షించాల్సివచ్చిందని భక్తులు పేర్కొన్నారు. ప్రత్యేక దర్శనాలకు కూడా 2 గంటలకుపైగా సమయం పట్టింది. కొండపైకి చేరడానికి ఉచిత బస్సులు ఏమాత్రం సరిపోలేదు. దీంతో చాలా మంది భక్తులు మెట్ల మార్గంలో కొండపైకి చేరుకున్నారు. భక్తుల విపరీతంగా తాకిడి కారణంగా క్యూలైన్లలో తాగునీరు, టాయిలెట్స్ వంటి సదుపాయాలు కల్పించామని ఆలయ అధికారులు పేర్కొన్నారు. ప్రత్యేక దర్శనాలు తగ్గించి దర్మదర్శనాలకు ప్రాదాన్యం ఇచ్చామన్నారు. సాద్యమైనంత వరకు భక్తులకు అసౌఖర్యం కలుగకుండా చర్యలు చేపట్టామని చెప్పారు.






