18 May, 2026 | 4:58 AM

జనసంద్రంగా యాదగిరి క్షేత్రం

18-05-2026 12:00 AM

యాదగిరిగుట్ట, మే 17 (విజయక్రాంతి): యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి రాష్ట్రం నలుమూలల నుంచి ఆదివారం భక్తులు భారీగా తరలివచ్చారు. కొండపైన వాహనాల రద్దీ పెరగడంతో ఉదయం 10 నుంచి మధ్యా హ్నం 2 గంటల వరకు వాహనాలను అనుమతించలేదు. కొండ కింద రింగురోడ్డులో వాహనాలతో పరిసరాలన్నీ నిండిపోయాయి. ధర్మద ర్శనానికి మూడు గంటలు, స్పెషల్ దర్శనానికి రెండు గంటల సమయం పట్టింది. వివిధ శాఖల ద్వారా రూ.52,63,697 నిత్య ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు.