30 March, 2026 | 9:42 PM

యాదగిరిగుట్ట దేవస్థానం హుండీ లెక్కింపు

30-03-2026 08:06 PM

యాదగిరిగుట్ట దేవస్థానం హుండీ ఆదాయం 1,52,01,420

శాస్త్రోక్తంగా స్వామివారికి నిత్య పూజలు

యాదగిరిగుట్ట,(విజయక్రాంతి): యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం కు 20 రోజుల హుండీ ఆదాయం 1,50,01,420 వచ్చినట్లు ఆలయ ఈవో భవాని శంకర్ తెలిపారు. యాదగిరిగుట్ట కొండ కింద వ్రత మంటపం హాల్ నెంబర్ 2 లో హుండీ ఉదయం ఏడు గంటలకు ప్రారంభమై సాయంత్రం వరకు లెక్కించారు. ఈ హుండీలలో నాణెములు, రూపాయలతో పాటు బంగారము, వెండి, విదేశీ కరెన్సీ కూడా వచ్చినట్లు ఆయన తెలిపారు.

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దివ్య క్షేత్రంలో సోమవారం నిత్య  పూజా కైంకర్యాలు   శాస్త్రోక్తంగా  నిర్వహించారు. వేకువ జామున  సుప్రభాత సేవతో స్వయంభులను మేల్కొల్పిన అర్చకులు గర్భగుడిలో కొలువు దీరిన స్వయంభులను సువర్ణ ప్రతిష్టమూర్తులను  వేదమంతోత్సవములు,  మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాలతో అభిషేకించి తులసీదళాలలను అర్పించారు. ప్రాకారమంటపంలో సుదర్శన నరసింహ హోమం, నిత్య కళ్యాణం పండితులు ఘనంగా నిర్వహించారు.

భక్తులు కల్యాణోత్సవంలో పాల్గొని మొక్కలను చెల్లించుకున్నారు. సాయంత్రం స్వామివారి వెండి జోడు సేవలో స్వామివారిని అలంకరించి తిరువీధులలో ఊరేగించారు. కొండపైన అనుబంధ ఆలయం శ్రీ రామలింగేశ్వర శివాలయంలో నిత్య కైంకర్యాలను పండితులు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకున్న ప్రముఖులు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని రాష్ట్ర సమాచార కమిషనర్  బోరెడ్డి అయోధ్య రెడ్డి  కుటుంబ సమేతముగా  దర్శించుకున్నారు.