యాదగిరి మృతి పార్టీకి, గ్రామానికి తీరని లోటు

15-09-2026 | 01:40pm

గ్రామ అభివృద్ధి, ప్రజాసేవే లక్ష్యంగా పనిచేశారు: మాజీ మంత్రి హరీశ్‌రావు

సిద్దిపేటరూరల్, సెప్టెంబర్ 15: నారాయణరావుపేట పార్టీ సీనియర్ నాయకుడు(Senior party leader), మాజీ సర్పంచ్ భర్త మాస యాదగిరి మృతి పార్టీకి, గ్రామానికి తీరని లోటని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు(Harish Rao) అన్నారు. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన యాదగిరి కుటుంబాన్ని హరీశ్‌రావు పరామర్శించారు. మాజీ సర్పంచ్ మాస శశిని ఓదార్చి మనోధైర్యం కల్పించారు.

ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. యాదగిరి నారాయణరావుపేట గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేసిన వ్యక్తి అని కొనియాడారు. గ్రామ సమస్యలు,అభివృద్ధి కార్యక్రమాలపై ఎప్పటికప్పుడు తనను కలిసి, సమస్యల పరిష్కారం కోసం పట్టుదలతో పనిచేసేవారని గుర్తుచేశారు. ప్రజా సేవనే లక్ష్యంగా చేసుకుని గ్రామ అభివృద్ధికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు.యాదగిరి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని హరీశ్‌రావు భరోసా ఇచ్చారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

మరిన్ని వార్తలు