23 June, 2026 | 8:38 PM

Breaking News

ఎన్నికల సంఘం ఆదేశానుసారంగా హెల్ప్ డెస్క్ ప్రారంభం   •   కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే బర్తరఫ్ చేయాలి   •   బోధన్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫ్రీ మెడికల్ క్యాంప్   •   ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలి   •   పాఠ్యపుస్తకాల పేరిట దోపిడీని అరికట్టాలి: ఏఐవైఎఫ్ హెచ్చరిక   •   నెల రోజులు ఇంటింటి సర్వే...   •   రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బులు వెంటనే జమ చేయాలి   •   కల్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మత్తు పదార్థాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం   •   ఫాదర్ అమల్ ఫ్రాన్సిస్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం   •   మూతపడిన ప్రభుత్వ పాఠశాల ప్రారంభానికి ముహూర్తం ఖరారు   •  

గజం భూమి @10లక్షలు

01-09-2024 12:46 AM

ముంబైతో పోటీ పడుతున్న బేగంబజార్

హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఆగస్టు 31 (విజయక్రాంతి):  రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహా నగరంలో సాధారణంగా భూముల ధరలు ఏ ప్రాంతంలో ఎక్కువగా ఉంటాయని ఎవరినైనా అడిగితే టక్కున బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, గచ్చిబౌలి, మాదాపూర్, కోకాపేట్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అని చెబుతారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ హైదరాబాద్‌లో ఎవరూ ఊహించని బేగంబజార్‌లో భూమి ధర ముంబయితో పోటీ పడుతుంది. బేగంబజార్‌లో గజం భూమి ధర తక్కువలో తక్కువ రూ.10 లక్షల వరకు పలుకుతోంది.

బేగంబజార్‌లో గజానికి కనీస ధర 10 లక్షలు ఉండగా, గల్లీ, వీధిని బట్టి రూ.10లక్షల నుంచి 12లక్షల వరకు భూమి ధరలున్నాయట. తాజాగా బేగం బజార్ లో 68 గజాల ఓ చిన్న స్థలం అక్షరాలా 6 కోట్ల 80 లక్షల రూపాయలకు అమ్మడుపోయిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. బేగంబజార్‌లో ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ర్టకు చెందిన హోల్‌ల్ సేల్ వ్యాపారులు ఎంతో మంది  చాలాకాలం కిందటే స్థిరపడిపోయారు. ప్రతిరోజు ఇక్కడ కొన్ని వందల కోట్ల వ్యాపారం జరుగుతోంది.

దీంతో ఈ ప్రాంతంలో భూమికి భారీ డిమాండ్ ఏర్పడింది. తాజాగా జరిగిన రెండు, మూడు భూమి లావాదేవీల్లో చదరపు గజం ధర బహిరంగ మార్కెట్‌లో సుమారు రూ. 10 లక్షలు పలికిందని స్థానికులు చెబుతున్నారు. బేగంబజార్‌లో చదరపు అడుగుల చొప్పున అమ్మకాలు జరిగే దకాణాలు, కమర్షియల్ భవనాల్లో ధరలు సైతం కోట్లలోనే పలుకుతున్నాయని స్థానిక రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెబుతున్నారు.

అలాగే భూమి అందుబాటులో లేకపోవడంతో పాత భవనాలను కూల్చి కొత్త భవనాలను నిర్మిస్తున్నారని, దీంతో పురాతన, శిథిలావస్థకు చేరిన భవనాలు ఇక్కడి భూ యజమానులకు కాసుల వర్షం కురిపిస్తున్నాయని స్థానికులు తెలిపారు. హైదరాబాద్‌లో గచ్చిబౌలి, బంజారా హిల్స్, జూబ్లీహిల్స్, కోకాపేట, మాదాపూర్‌లో భూములకు అత్యధిక ధరలు ఉన్నప్పటికీ.. బేగంబజార్ లో అంతకు మించిన ధరలు ఉండడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.