23 June, 2026 | 8:21 PM

Breaking News

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలి   •   పాఠ్యపుస్తకాల పేరిట దోపిడీని అరికట్టాలి: ఏఐవైఎఫ్ హెచ్చరిక   •   నెల రోజులు ఇంటింటి సర్వే...   •   రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బులు వెంటనే జమ చేయాలి   •   కల్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మత్తు పదార్థాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం   •   ఫాదర్ అమల్ ఫ్రాన్సిస్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం   •   మూతపడిన ప్రభుత్వ పాఠశాల ప్రారంభానికి ముహూర్తం ఖరారు   •   విబిజీ రాంజీ విధానాన్ని రద్దుచేసి 'ఎన్ఆర్ఈజీఎస్'ను పునరుద్ధరించాలి   •   చంద్‌నగర్ ప్రాథమిక పాఠశాలకు ఆర్వో ప్లాంట్ అందజేసిన సర్పంచ్ సింగం శ్రీహరి   •   పదవ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు సన్మానం   •  

ఫాదర్ అమల్ ఫ్రాన్సిస్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

23-06-2026 07:33 PM

యోగా ఆరోగ్యవంతమైన జీవనానికి పునాది : ఫాదర్ అమల్ ఫ్రాన్సిస్

శంషాబాద్,(విజయక్రాంతి): అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శంషాబాద్‌లోని ఇన్ఫాంట్ జీసస్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఘనంగా యోగా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ రెవ. ఫాదర్ అమల్ ఫ్రాన్సిస్, ఫాదర్ కిషోర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.కార్యక్రమాన్నిo ప్రారంభించిన ప్రిన్సిపాల్ ఫాదర్ అమల్ ఫ్రాన్సిస్ మాట్లాడుతూ... యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన వరమని పేర్కొన్నారు. యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు ఒత్తిడి తగ్గి జీవన నాణ్యత పెరుగుతుందని తెలిపారు.

ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగాను భాగంగా చేసుకోవాలని సూచించారు.ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ యోగా ఆసనాలు, ప్రాణాయామాలను ప్రదర్శించి ఆకట్టుకున్నారు. యోగా సాధన వల్ల ఏకాగ్రత, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని యోగా ఉపాధ్యాయుడు సుబ్బయ్య వివరించారు.కార్యక్రమం విజయవంతంగా ముగియగా విద్యార్థులు యోగా పట్ల విశేష ఆసక్తి కనబరిచారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగా ఎంతో దోహదపడుతుందని పాల్గొన్నవారు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని యోగా ప్రాముఖ్యతను చాటిచెప్పారు.