23 June, 2026 | 8:31 PM

Breaking News

ఎన్నికల సంఘం ఆదేశానుసారంగా హెల్ప్ డెస్క్ ప్రారంభం   •   కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే బర్తరఫ్ చేయాలి   •   బోధన్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫ్రీ మెడికల్ క్యాంప్   •   ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలి   •   పాఠ్యపుస్తకాల పేరిట దోపిడీని అరికట్టాలి: ఏఐవైఎఫ్ హెచ్చరిక   •   నెల రోజులు ఇంటింటి సర్వే...   •   రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బులు వెంటనే జమ చేయాలి   •   కల్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మత్తు పదార్థాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం   •   ఫాదర్ అమల్ ఫ్రాన్సిస్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం   •   మూతపడిన ప్రభుత్వ పాఠశాల ప్రారంభానికి ముహూర్తం ఖరారు   •  

కల్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మత్తు పదార్థాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం

23-06-2026 07:35 PM

కల్లూరు,(విజయక్రాంతి): యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడేందుకు కల్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో యాంటీ డ్రగ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై వివరంగా అవగాహన కల్పించారు. వక్తలు మాట్లాడుతూ మత్తు పదార్థాలు శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతాయని, విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.

అలాగే సమాజంలో నేరాల పెరుగుదలకు కూడా ఇవి కారణమవుతాయని తెలిపారు. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి, తమ లక్ష్యాలపై దృష్టి పెట్టాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.