calender_icon.png 10 May, 2025 | 8:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యలమంచిలి శ్రీనివాస్ రావును కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్

09-05-2025 10:11:26 PM

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్  చిన్నారెడ్డి

బాన్సువాడ,(విజయక్రాంతి): బాన్సువాడ నియోజకవర్గం లోని కాంగ్రెస్ పార్టీ లో ఉంటూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడు తున్న ఎలమంచిలి శ్రీనివాసరావు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అమాయకులైన కాంగ్రెస్ పార్టీ  కార్యకర్తలను రెచ్చగొడుతు గందరగోళం సృష్టిస్తున్న బాన్సువాడ నియోజకవర్గం వర్ని మండలం  సత్యనారాయణ పూరం గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు యలమంచిలి శ్రీనివాసరావు అనే వ్యక్తి కి ఈ నెల  తేది 5 మే 2025 రోజున పార్టీ నిర్ణయాలకు  వ్యతిరేకంగా పని చేస్తున్నందుకు వివరణ ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ నోటీస్ జారీ చేయగా యలమంచిలి శ్రీనివాస రావు నుంచి ఏలాంటి సమాధానాలు ఇవ్వలేదు. సమాధానాలు ఇవ్వకపోగా  రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ జి.చిన్నారెడ్డి  కమిటీ సభ్యులు బాన్సువాడ నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకుని నాయకులు కార్యకర్తల అభిప్రాయాల మేరకు ఈరోజు 09 మే 2025 నాడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆరు (06) సంవత్సరాల పాటు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేసారు. కాంగ్రెస్ పార్టీ లో ఉంటూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని ఆయన తెలిపారు.