09-05-2025 10:15:22 PM
కామారెడ్డి,(విజయక్రాంతి): రాష్ట్ర రవాణా శాఖ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శుక్రవారం కామారెడ్డి జిల్లాకి రావడంతో జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్కు స్వాగతం పలికారు. మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు ఎంపీ సురేష్ సెట్ కార్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.