17 April, 2026 | 2:25 PM

Breaking News

తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •   శ్రీ భీమేశ్వర స్వామి సేవలో ఐజీపీ రమేష్ నాయుడు   •  

ఎల్లయ్య స్మారక క్రికెట్ పోటీలు

06-04-2025 08:22 PM

విజేతలకు బహుమతులు ప్రధానం..

మందమర్రి (విజయక్రాంతి): మున్సిపాలిటీ పరిధిలోని ఆరవ వార్డు రామకృష్ణాపూర్ లో సార్ల ఎల్లయ్య స్మారక క్రికెట్‌ పోటీలు వారి కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. రామకృష్ణాపూర్ (వి) మైదానంలో ఆదివారం ఎల్లయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం క్రికెట్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో పట్టణానికి చెందిన కపిల్ జట్టు, ప్రశాంత్ జట్టు, శేఖర్, వినోద్, హర్ష జట్టులు పాల్గొన్నాయి. ఐపిఎల్ తరహాలో హోరాహోరీగా జరిగిన ఫైనల్ పోటీల్లో ప్రశాంత్ జట్టు శేఖర్ జట్టుపై ఘన విజయం సాధించింది.

విజేతగా నిలిచిన ప్రశాంత్ జట్టు సభ్యులకు 4 వేల రూపాయలు నగదుతో పాటు మెమొంటో అందించారు. రన్నర్ గా నిలిచిన శేఖర్ జట్టు సభ్యులకు 2 వేలు నగదు మెమోంటో అందజేశారు. మిగతా జట్టు కెప్టెన్ లకు మెమోంటోలు అందజేశారు. విజేతలకు బహుమతులను ఏకలవ్య ఎరుకల సంఘం జిల్లా అధ్యక్షుడు దుగ్యాల బాపు చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏకలవ్య ఎరుకల సంఘం ప్రధాన కార్యదర్శిలోకి, నిర్వాహకులు సార్ల మల్లమ్మ, సమ్మక్క, రాజమల్లు, సమ్మయ్యలు పాల్గొన్నారు.