పెరిగిన బంగారం, వెండి ధరలు
తులంపై రూ.2,242 పెరుగుదల
హైదరాబాద్‌లో 10 గ్రాముల పసిడి ధర రూ.1,55,490
కిలో వెండి ధర రూ.2.57లక్షలు
న్యూఢిల్లీ, జూన్ 15: అమెరికా మధ్య శాంతి ఒప్పందం ప్రకటనతో ఒకపక్క మార్కెట్ సెంటిమెంట్ బలపడటం, మరోపక్క అంతర్జాతీయంగా సానుకూల సంకేతా లు కనిపించడంతో సోమవారం బంగారం, వెండి ధరలకు రెక్కలొచ్చాయి. సోమవారం హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,55,490 పలికింది. అటు వెండి కేజీ ధర 2.57లక్షలకు చేరింది. గత వారం ఒక దశలో పసిడి ధర రూ.1.5లక్షల కన్నా కిందికి పడిపోయిన విషయం తెలిసిందే.
10 గ్రాముల పసిడి ధర రూ.2,242 పెరిగి రూ.1.52 లక్షలకు(అధనపు చార్జీలు కాకుండా) చేరింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లో, ఆగస్టు డెలివరీకి సంబంధించిన బంగారం ధర 2,242 పెరిగి, 10 గ్రాము లకు రూ.1,52,770 వద్ద నమోదైంది. అంతర్జాతీయ విపణిలోనూ పసిడి, వెండికి గిరాకీ పెరిగింది. స్పాట్ గోల్డ్ ఔన్స్ ధర 4,323 డాలర్లు, ఔన్సు వెండి ధర 70.38 డాలర్లకు చేరింది. గతవారం బంగారం ధర ఒక దశ లో సుమారు 4000 డాలర్లకు తగ్గింది. ఇ దిలా ఉంటే కమొడిటీ ఎక్సేంజీలో గోల్డ్ ఫూచర్స్ ధర రూ.1,53,258గా ఉంది. వెండి ఫ్యూచర్స్ ధర రూ.2,52, 383గా ట్రేడ్ అవుతోంది.






