17 April, 2026 | 10:31 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

యోగా దినోత్సవంలో యోగాసనాలు

21-06-2025 04:47 PM

గద్వాల టౌన్: యోగా దినోత్సవం సందర్బంగా శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయం, ఎస్పీ కార్యాలయం, ఇండోర్ స్టేడియం, స్మృతి వనం నందు 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం(International Yoga Day) వేరువేరుగా నిర్వహించారు. యోగా దినోత్సవంలో ఎస్పి టి.శ్రీనివాసరావు, డి.ఎస్.పి మొగులయ్య, గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పాల్గొని యోగాసనాలు చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ప్రజలకు అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి యోగా ద్వారా మన శరీరాన్ని శుద్ధి చేసి, మంచినే ఆచరిస్తూ అమూల్యమైన ఫలితాన్ని పొందవచ్చని యోగా అనేది కేవలం వ్యాయామం కాదని ఇది మన శరీరానికి ఆరోగ్యాన్ని మనసుకు ప్రశాంతతను ఇచ్చే మార్గమని అన్నారు. యోగా చేయడం ద్వారా మన జీవితానికే కొత్త దారి తెరుస్తుందని ప్రతి రోజు కనీసం 30 నిమిషాలు యోగా చేసేందుకు సమయాన్ని కేటాయించాలని సూచించారు.