21-06-2025 04:49:26 PM
బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): జాతీయ యోగా దినోత్సవం(International Yoga Day) బెల్లంపల్లిలో అట్టహాసంగా జరిగింది. బెల్లంపల్లి తిలక్ గ్రౌండ్లో జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని యోగాసనాలు చేశారు. బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, సీఐ అఫ్జలుద్దీన్ యోగా దినోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిలక్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బెల్లంపల్లి ఏసీపీ రవి కుమార్ ను సన్మానించారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో..
ఇదిలా ఉండగా జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని బెల్లంపల్లి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో యోగా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. బెల్లంపల్లి ఏరియాస్పపత్రి సూపర్డెంట్ రవికుమార్ యోగ జ్యోతిని వెలిగించారు. ఆస్పత్రి ఆవరణలో వైద్యులు,సిబ్బంది యోగా దినోత్సవ ర్యాలీ చేశారు. ఈ కార్యక్రమంలో తాళ్ల గురజాల ఎస్సై రమేష్, ఏరియాస్పపత్రి ల్యాబ్ టెక్నీషియన్ శ్రీనివాసు, వైద్య సిబ్బంది, వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు గెల్లి జయరాం, యోగా మాస్టర్ ముప్పిడి రమేష్ తదితరులు పాల్గొన్నారు.