22 June, 2026 | 3:03 AM

ఐవీవై, సిద్ధార్థ విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఘనంగా యోగా దినోత్సవం, ఫాదర్స్ డే వేడుకలు

22-06-2026 12:00 AM

ముకరంపుర, జూన్ 21 (విజయ క్రాంతి): నగరంలోని సీతారాంపూర్ లో ఐ వి వై, సిద్ధార్థ విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఈ షా ఫౌండేషన్ సహకారంతో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం, ఫాదర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల వ్యవస్థాపకులు పసుల మహేష్ , కో చైర్మెన్ దాసరి శ్రీపాల్ రెడ్డి , డైరెక్టర్ పసుల జయశ్రీ , స్వప్న, ప్రిన్సిపల్ లలిత జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు .

ఈ సందర్భంగా ఈ షా ఫౌండేషన్ గురుకులానికి చెందిన హాఠ యోగ శిక్షకులు పృద్వి, ప్రణవి సూర్య నమస్కారాలు , భుజంగాసనం , వృక్షాసనం , త్రికోణాసనం , వజ్రాసనం తడాసనం తదితర యోగాసనాలను అందరితో చేయించి వాటి వల్ల కలిగే శారీరక మానసిక ప్రయోజనాలను వివరించారు.

అనంతరం ఫాదర్స్ డే సందర్భంగా విద్యార్థుల తండ్రుల కోసం పాఠశాల యజమాన్యం పలు వినోదాత్మక, సృజనాత్మకత పోటీలు , ఆటలు నిర్వహించగా వారు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు . విజేతలకు పాఠశాల చైర్మన్ ఫాదర్స్ డే గుర్తుగా జ్ఞాపికలు అందజేసి అభినందించారు . ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.