22 June, 2026 | 3:01 AM

మార్షల్ ఆర్ట్స్‌లో ప్రతిష్టాత్మక బ్లాక్ బెల్ట్ సాధించిన యశ్వంత్

22-06-2026 12:00 AM

వేములవాడ,జూన్ 21,(విజయక్రాంతి)మార్షల్ ఆరట్స్ రంగంలో రాజన్న సిరిసిల్ల జిల్లా, వే ములవాడకు చెందిన శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థి దూలం యశ్వంత్ విశిష్ట ప్రతిభ కనబరిచి ప్ర తిష్టాత్మక బ్లాక్ బెల్ట్ను సొంతం చేసుకున్నాడు. ఈ విజయంతో విద్యార్థిని పాఠశాల యాజమా న్యం, కరాటే సంఘం ప్రతినిధులు ఘనంగా సత్కరించి అభినందించారు.కరీంనగర్లోని ఇంగ్లీష్ యూనియన్ స్కూల్లో ఆదివారం నిర్వహించిన ఒకినావా మార్షల్ ఆరట్స్ అకాడమీ కరాటే గ్రే డింగ్ పరీక్షల్లో యశ్వంత్ పాల్గొన్నాడు.

రాజన్న సిరిసిల్ల జిల్లా ఒకినావా స్పోరట్స్ కరాటే అకాడ మీ ఫౌండర్, మాస్టర్ అబ్దుల్ మన్నాన్ ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్న యశ్వంత్, కరాటేలో కీలకమైన కటాస్, కుమిటే విభాగాల్లో తన నైపుణ్యాన్ని ప్రదర్శించి పరీక్షకుల ప్రశంసలు అందుకున్నాడు.ఈ సందర్భంగా ఒకినావా మార్షల్ ఆరట్స్ చీఫ్ ఎగ్జామినర్ కే. వసంత్ కుమార్ చేతుల మీదుగా యశ్వంత్కు బ్లాక్ బెల్ట్తో పాటు ప్రశంసా పత్రం అందజేశారు. కరాటేలో ఉన్నత స్థాయి నైపుణ్యానికి గుర్తింపుగా లభించే ఈ బ్లాక్ బెల్ట్ సాధించడం గర్వకారణమని నిర్వాహకులు పేర్కొన్నారు.

యశ్వంత్ విజయాన్ని పురస్కరించుకుని ఒకినావా స్పోరట్స్ కరాటే అకాడమీ జిల్లా అ ధ్యక్షులు కొండ దేవయ్య, శ్రీ చైతన్య విద్యాసంస్థల ఏజీఎం ముద్రకోల రాజు, ప్రిన్సిపాల్ సుదీష్ కుమారి ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థి చదువుతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ చాటుతూ పాఠశాలకు మంచి పేరు తీసుకురావడం సంతోషకరమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కరాటే శిక్షకులు కొమురవెల్లి భూమేష్, తదితరులు పాల్గొని యశ్వంత్ను అభినందించారు.