ధరణి దరఖాస్తులను పరిష్కరించాలి
22-06-2024 03:41 AM
- బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి
నిజామాబాద్, జూన్ 21(విజయక్రాంతి): ధరణి దరఖాస్తులను రెవెన్యూ అధికారులు సత్వరం పరిష్కరించేలా చూడాలని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతును ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి కోరారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన సమీక్షలో ఎమ్మెల్యే మాట్లాడారు. తహసీల్దార్లు తమ మాడ్యూల్‌లో దరఖాస్తులు పెండింగ్‌లో ఉండకుండా చూసుకోవాలన్నారు. క్షేత్రస్థాయికి వెళ్లి భూములను పరిశీలించాలన్నారు. ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం ఇవ్వొద్దన్నారు. రైతులు బ్యాం కుల నుంచి రుణం పొందేందుకు, లేదా అవసరాలకు పట్టాపాస్ పుస్తకాలు అవశ్యమన్నారు. సమీక్షలో రాష్ట్ర ఉర్డూ అకాడమీ చైర్మన్ తాహెర్ బీన్ హమ్దాన్, బోధన్ ఆర్డీవో రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.






