18 June, 2026 | 1:50 AM

ప్రపంచ వ్యాప్తంగా యోగాకు విశేష ఆదరణ

18-06-2026 12:00 AM
  1. ఎంపీ ఈటల రాజేందర్
  2. 20న పరేడ్ గ్రౌండ్‌లో ప్రపంచ యోగా వేడుకలు

సికింద్రాబాద్, జూన్ 17 (విజయక్రాంతి): ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో నిర్వహించనున్న భారీ యోగా కార్యక్రమ ఏర్పాట్లను మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేం దర్  బుధవారం పరిశీలించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యం లో నిర్వహించనున్న ఈ కార్య క్రమానికి సంబంధించిన ఏర్పాట్ల ను మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, ఇతర బీజేపీ నాయకుల తో కలిసి సమీక్షించారు.

ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ భారత దేశం ప్రపంచానికి నాగరికత, సంస్కృతి,మానవ విలువలను అందించిన దేశమని పేర్కొన్నారు. ప్రపంచానికి శాంతి, ఆరోగ్యం అందించాలనే సంకల్పంతో ప్రధాని నరేంద్ర మోడీ ఐక్యరాజ్యసమితి ముందు యోగాను ప్రతిపాదించార ని గుర్తు చేశారు.ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్, కిడ్నీ సంబంధిత వ్యాధులు, రక్తపోటు, మధుమేహం వంటి అనారోగ్య సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో ఆరోగ్య వంతమైన సమాజ నిర్మాణానికి యోగా ఒక ఉత్తమ మార్గమని ఆయన అన్నారు.

ప్రధాని మోదీ చేసిన ప్రతిపాదనకు ప్రపంచ దేశాలు మద్దతు ఇవ్వడంతో 2014 డిసెంబర్ 11న యునైటెడ్ నేషన్స్ జూన్ 21ను ప్రపంచ యోగా దినోత్సవంగా ప్రకటించిందని వివరించారు.  ఈ నెల 20వ తేదీ ఉదయం 5 గంటలకు సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో వేలాది మంది పాల్గొనేలా భారీ యోగా కార్యక్ర మాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జంట నగరాల ప్రజలు, వాకర్లు, సీనియర్ సిటిజన్లు, యువత పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్ర మాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.