యోగా.. దేశ చారిత్రక సంపద
అంతర్జాతీయ యోగా వేడుకల్లో మంత్రి దామోదర
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 18 (విజయక్రాంతి) : ప్రపంచ దేశాలలో మన పూర్వీకులు మనకిచ్చిన గొప్పవరం యోగా అని, ఈ చారిత్రక సంపదను ప్రతి ఒక్కరూ దినచర్యలో భాగం చేసుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆకాంక్షించారు. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా డే సందర్భంగా ఆయుష్ విభాగం నిర్వహించనున్న 4 రోజుల వేడుకలను మంత్రి మంగళవారం నెక్లెస్ రోడ్డులో ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లా డుతూ యోగా సాధన వలన శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఆరోగ్య సమతుల్యత ఏర్పడుతుందన్నారు. యోగా దినో త్సవంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి యోగా ఉత్సవాలను ప్రారంభిస్తున్నట్టుగా బెలూన్లను గాలిలో ఎగురవేశారు.






