31 July, 2026 | 2:47 AM

మార్కండేయగా విక్రాంత్

31-07-2026 01:17 AM

‘సంతాన ప్రాప్తిరస్తు’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో తనకుంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు యంగ్ హీరో విక్రాంత్. ఈ సినిమా విజయం ఇచ్చిన ప్రోత్సాహంతో విక్రాంత్ ప్రస్తుతం పలు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా ప్రముఖ నిర్మాణ సంస్థ దిల్ రాజు డ్రీమ్స్ బ్యానర్‌లో ‘మార్కండేయ’ అనే డివోషనల్ మిస్టికల్ థ్రిల్లర్ చిత్రంలో నటిస్తున్నారు.

ఈ సంస్థలో రూపొందుతున్న తొలి సినిమాలో విక్రాంత్ హీరో కావడం విశేషం. ఈ సినిమా త్వరలో చిత్రీకరణ జరుపుకోనుంది. ఈ సినిమా హీరో విక్రాంత్‌కు మంచి ఫేమ్ తీసుకురానుంది. ఈ సినిమాతోపాటు విక్రాంత్ మధుర శ్రీధర్‌రెడ్డి, ప్రొడ్యూసర్ సురేశ్‌బాబు కాంబినేషన్‌లో మరో ఇంట్రెస్టింగ్ హారర్ కామెడీ చిత్రంలో నటించబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ వివరాలు మేకర్స్ వెల్లడించనున్నారు.