యువ నేతకు కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి పదవి
20-03-2026 12:11 AM
కొల్చారం, మార్చి 19 :యువజన కాంగ్రెస్ నాయకుడు పుల్లబోయిన దుర్గేష్కు జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి పదవి లభించింది. పార్టీ కోసం కృషి చేస్తున్న కార్యకర్తలకు ప్రాధాన్యతనిస్తూ ఆయనను నియమించినట్లు డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా దుర్గేష్ మాట్లాడుతూ, రాహుల్ గాంధీ నాయకత్వంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. తనపై నమ్మకం ఉంచిన పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.




