29 June, 2026 | 2:03 AM

నేడు మండలంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ రావ్ పర్యటన

29-06-2026 12:00 AM

పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు

గాంధారి, జూన్ 28 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో నేడు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావ్ పర్యటన ఉంటుందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సింగసాని శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మండలంలోని పలు గ్రామాల్లో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాలను ప్రారంభించనున్నట్టు ఆయన తెలిపారు. అనంతరం తిమ్మాపూర్ గ్రామంలో మహిళా సమాఖ్య భవనానికి భూమి పూజ నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. మండలంలోని ఆయా గ్రామాల సర్పంచ్ లు, ప్రజా ప్రతినిధులు, నాయకులు , కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన అన్నారు.