15 April, 2026 | 12:10 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

వైద్యం వికటించి యువకుడి మృతి

23-06-2025 12:00 AM
  1. న్యాయం కోసం బాధితుల ఆందోళన 
  2. ఒకేసారి మూడు ఇంజక్షన్లు
  3. అస్వస్థతకు గురై అక్కడికక్కడే మృతి
  4. నెన్నల మండలంలో ఘటన

బెల్లంపల్లి అర్బన్, జూన్ 22 : అచ్చిరాని ఆర్.ఎం.పి వైద్యం ఓ యువకుడి ప్రాణాన్ని బలిగొంది. ఈ సంఘటన శనివారం రాత్రి నేన్నల మండలం గొల్లపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. నెన్నల మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన లింగంపల్లి శ్రీని వాసు (38) ఆర్‌ఎంపీ చేసిన వైద్యం వికటించి మృతి చెందాడు. కొంతకాలంగా శ్రీనివాసు పైల్స్‌తో బాధపడుతున్నాడు. ఇదే క్రమంలో ఫైల్స్‌తో ఇబ్బంది పడుతున్న శ్రీనివాసు దహేగాం గ్రామానికి వైద్యం కోసం శనివారం రాత్రి తన భార్య, తల్లిని వెంట తీసుకొని ఆర్‌ఎంపీ వైద్యుడు వినయ్ సర్కా ర్ వద్దకి వెళ్ళాడు.

ఆర్‌ఎంపీ వైద్యుడు ఒకేసారి మూడు ఇంజక్షన్లు ఇచ్చాడు. దీంతో చెమటలు పట్టి స్పృహ తప్పాడు. అస్వస్థత గురైన శ్రీనివాసును తొలుత ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించే క్రమంలో మృ తి చెందాడు. ఆర్‌ఎంపీ వైద్యుడు బినయ్ సర్కార్ శ్రీనివాసును బెల్లంపల్లికి తన కారులోనే ఆసుపత్రికి తీసుకొస్తున్న క్రమంలోనే  మృతి చెందాడు.

ఈ విషయాన్ని గమనించిన వైద్యుడు మార్గo మధ్యలోనే అక్కడి నుంచి  పరారయ్యాడు. బాధితులు 108కు ఫోన్ చేసి అంబులెన్స్‌ను తెప్పించుకున్నారు. అంబులెన్స్‌లో బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి రాత్రి 11 గంటలకు శ్రీనివాసును తీసు కొచ్చారు. వైద్యులు పరీక్షించి అప్పటికే శ్రీనివాస్ మృతి చెందినట్లు  నిర్ధారించారు.

న్యాయం కోసం బాధితుల రాస్తారోకో

వైద్యం వికటించిన మృతి చెందిన శ్రీనివాసు కుటుంబ సభ్యులు న్యాయం కోసం ఆందోళనకు దిగారు. తన భర్త మరణానికి కారణమైన వైద్యుడు బినయ్ సర్కార్ పై చర్య తీసుకోవాలని శ్రీనివాస్ భార్య కళ్యాణి, కుటుంబ సభ్యులు ఆస్పత్రి వద్ద ఆందోళనకి దిగారు. పోస్టుమార్టం చేయకుండా పోలీసులు జాప్యం పై బాధితులు ఆగ్రహం వ్య క్తం చేశారు. నిందితుడి తరపున పోలీసులు జరిపిన బేరసారాలు ఫలించలేదు.

అటు పోస్టుమార్టం జరగకుండా ఇటు వైద్యుడిపై చర్యలు లేకపోవడంతో విసిగిపోయిన బాధితులు ధర్నాకు దిగారు. ఆదివారం మధ్యా హ్నం వరకూ కూడా పోస్టుమార్టం జరగలేదు. ఈ జాప్యంపై శ్రీనివాస్ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఉన్న జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. ఈ ఆందోళనతో రోడ్డుపై ఎక్కడికక్కడా పెద్దఎత్తున వాహనాలు నిలిచిపో యాయి.

దీంతో పరిస్థితి అదుపులో ఉం చేందుకు బెల్లంపల్లి, తాండూరు, మందమర్రి ప్రాంతాల నుంచి పోలీసులు రం గంలోకి దిగారు. శ్రీనివాస్ మృతికి నష్టపరిహారంతో పాటు వైద్యుడుపై కేసు నమో దు చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. శ్రీనివాస్ కుటుంబానికి న్యాయం జరగాలని ఎమ్మార్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. రోడ్డుపై ఆందో ళనను ఎంతకీ ఆందోళనకారులు విరమించక పోవడంతో బెల్లంపల్లి ఏసిపి రవికు మార్ రంగంలోకి దిగాడు.

ఘటనాస్థలికి వచ్చి శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. తగిన న్యాయం చేస్తానని ఏసీపీ రవి కుమార్ హామీ ఇవ్వడంతో బాధితులు ఆం దోళనను విరమించారు. శ్రీనివాస్‌కు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.