15 April, 2026 | 1:48 PM

Breaking News

ధాన్యం కొనుగోలు కేంద్రాలను తక్షణమే ప్రారంభించాలి.. సీపీఐ డిమాండ్   •   చీల‌ప‌ల్లిలో పొంగిపొర్లుతున్న నిర్లక్ష్యం   •   మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిపై దాడి   •   అక్రమాలు ప్రశ్నిస్తే కక్ష కట్టారు   •   ఎక్సైజ్ కోర్టు కానిస్టేబుల్ కు ఘనంగా వీడ్కోలు   •   ట్రాక్టర్ డీకొని బాలుడికి తీవ్రగాయాలు   •   గ్రామీణ అభివృద్ధితో ప్రజల జీవన ప్రమాణాల పెంపు లక్ష్యం   •   టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •  

ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలి

23-06-2025 12:00 AM

బోథ్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఎంపీ నగేష్

అదిలాబాద్, జూన్ 22 (విజయ క్రాంతి) : ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీ పార్టీ జెండాను స్థానిక సంస్థల్లో ఎగురవేసి, పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించిన కార్యకర్తలకు అండదండలుగా ఉంటా మని అదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ అన్నారు. తలమడుగు మండలంలోని ఉమ్ డం  గ్రామంలో బోథ్ నియోజకవర్గ స్థాయి బీజేపీ కార్యకర్తలు సమావేశంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ తో కలిసి ఎంపీ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఎంపీ నగేష్ మాట్లాడుతూ నియోజకవర్గంలో గడిచిన 30 సంవత్సరాలుగా తనకున్న సుదీర్ఘ రాజకీయ అనుభవంతో ప్రతి గ్రామంలో ప్రతి ఒక్క కార్యకర్త గురించి తనకు అన్ని విషయాలు తెలుసు అని అన్నారు. ఎవరు పార్టీకి అనుకూలం, ప్రతికూలం గా వ్యవహరించిన విషయమై తనకు అన్ని విషయాలు సమాచారం ఉంటుందని వెల్లడించారు.

దాని ఆధారంగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో నిజమైన కార్యకర్తలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పార్టీకి అండగా ఉండే వారికి తాము అండగా ఉంటామని అన్నారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షులు బ్రహ్మానంద్ తో పాటు నియోజకవర్గం లోని ఆయా మండలాల నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు