6 April, 2026 | 3:48 AM

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి, కార్పొరేట్‌కు తీవ్ర గాయాలు

06-04-2026 01:49 AM

పాల్వంచ, ఏప్రిల్ 5 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందగా, పాల్వంచ డివిజన్ 34వ డివిజన్ కార్పొరేటర్ బట్టు విజయలక్ష్మి గాయాల పాలయింది.

వివరాల్లోకి వెళితే బట్టు విజయలక్ష్మి, అతని కుమారుడు బట్టు అఖిల్ నంద్ (20) ద్విచక్ర వాహనంపై పాల్వంచ పట్టణంలోని పోలీస్ స్టేషన్ ఎదురుగా యూటర్న్ తీసుకుంటున్న క్రమంలో భద్రాచలం  నుంచి కొత్తగూడెం వైపు వెళ్తున్న గుర్తుతెలియని కారు అతివేగంగా ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో అఖిల్ నంద్ అక్కడికక్కడే మృతి చెందగా, కార్పొరేటర్ విజయలక్ష్మి తీవ్ర గాయాలపై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాబు జగజ్జివన్ రావు జయంతి వేడుకలకు హాజరయ్యేందుకు వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పాల్వంచ పట్టణ ఎస్‌ఐ నాగరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

మరో రోజు అయితే కౌన్సిలింగ్ వెళ్లాల్సింది 

మృతుడు అఖిల్ నందు ఇంటర్మీడియట్ పూర్తి చేసుకొని జె ఈ ఈ పరీక్షలు మెయిన్ కు హాజరు కావాల్సి ఉంది. ఈ సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడం ప్రతి ఒక్కరినే కలిసి వేసింది.