రేషన్ షాపును సీజ్ చేసిన డీటీ (సివిల్ సప్లై) మోబినోల్ల
06-04-2026 01:48 AM
దేవరకొండ (గుండ్లపల్లి), ఏప్రిల్ 5 : గుండ్లపల్లి మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో గల రేషన్ షాపును దేవరకొండ డిటి (సివిల్ సప్లై) మోబినోల్ల ఆదివారం తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో రేషన్ సరుకుల్లో భారీగా వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించారు.
రికార్డుల ప్రకారం ఉండాల్సిన నిల్వలకు, షాపులో ఉన్న సరుకులో తేడాలు ఉండటంతో నిబంధనల ఉల్లంఘన కింద అధికారులు సదరు రేషన్ షాపును సీజ్ చేశారు. అనంతరం డీల్ప 6-ఏ కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.




