calender_icon.png 4 December, 2025 | 4:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆటోలో శవాలుగా యువకులు

04-12-2025 12:00:00 AM

  1. చాంద్రాయణగుట్ట రోమన్ హోటల్ ఎదురుగా నిలిపి ఉంచిన ఆటోలో మృతదేహాలు
  2. డ్రగ్స్ వికటించి మృతి చెందినట్లు అనుమానం
  3. ఘటనా స్థలంలో 3 ఘటనా స్థలం చేసుకున్న క్లూస్ టీం

హైదరాబాద్ సిటీ బ్యూరో, డిసెంబర్ 3 (విజయక్రాంతి): నగరంలోని పాతబస్తీలో విషాదం చోటుచేసుకుంది. చాంద్రాయణగుట్ట పరిధిలో ఇద్దరు యువకులు అనుమా నాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. రోమన్ హోటల్ ఎదురుగా నిలిపి ఉంచిన ఓ ఆటోలో ఇద్దరు విగతజీవులుగా పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు, క్లూస్ టీం అక్కడకు చేరుకుని ఆధారాలు సేకరించారు. ఆటోలో మూడు సిరంజీలు లభ్యం కావడంతో.. వీరు అధిక మోతాదు లో మాదకద్రవ్యాలు తీసుకోవడం వల్లే మరణించి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. మృతులను జహంగీర్ (24), ఇర్ఫాన్ (25)గా గుర్తించారు.

ఈ ఘటన జరిగిన సమయంలో వీరితో పాటు మరో వ్యక్తి కూడా ఉన్నట్లు, అతడు అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులకు సమాచారం అందింది. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమో దు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.