14 June, 2026 | 2:01 PM

బంజీ జంప్ సిబ్బంది నిర్లక్ష్యం.. 21 ఏళ్ల యువతి మృతి

14-06-2026 01:18 PM

బ్రెజిల్‌: బంజీ జంప్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా 21 ఏళ్ల యువతి ప్రాణాలు కొల్పోయిన ఘటన బ్రెజిల్‌లో జరిగింది.  సావో పాలో రాష్ట్రానికి చెందిన మరియా ఎడువార్డా రోడ్రిగ్స్ డి ఫ్రీటాస్ అనే యువతి తన స్నేహితులతో కలిసి బ్రెజిల్‌లోని లైమీరా ప్రాంతానికి వెళ్లింది. స్కెలిటన్ బ్రిడ్జ్ వద్ద ఒక ప్రైవేట్ సంస్థ నిర్వహించిన బంజీ జంపింగ్ కార్యక్రమంలో మరియా ఎడువార్డా రోడ్రిగ్స్ డి ఫ్రీటాస్ బంగీ జంప్ చేయడానికి వెళ్లింది. యువతిని కిందకి వదిలేముందు నిర్వాహకులు తనకు భద్రతా తాడును కట్టడం మార్చాపోయారు. మరియాను స్కెలిటన్ బ్రిడ్జ్ చివరకు తీసుకువచ్చి 40 మీటర్ల ఎత్తు నుంచి కిందికి తోశారు.

యువతికి భద్రతా తాడును కట్టకుండా సిబ్బంది వంతెన పైనుంచి విసిరేయడంతో 130 అడుగులకు పైగా లోతుకు పడిపోయి మృతి చెందింది. ఈ ఘటన చూస్తుండగా భయాందోళనలు చెలరేగడంతో పాటు, ఈ ఘోర ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు క్రిమినల్ దర్యాప్తు ప్రారంభించారు. మృతురాలికి భద్రతా తాడు కట్టకుండా సిబ్బంది నిర్లక్ష్యం వహించడం వల్లే ఆమె మరణించినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఘటనా స్థలంలో రికార్డ్ చేయబడిన వీడియోలలో, సిబ్బంది ఆమెను వంతెన అంచు వరకు తోడ్కొని వెళ్లి కిందకి తోసిన్నట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వీడియో వైరలవుతుంది.