20-02-2026 01:16:28 AM
కుమ్రం భీం ఆసిఫాబాద్, ఫిబ్రవరి 19(విజయక్రాంతి): మీసేవ ద్వారా వచ్చిన వివిధ దరఖాస్తులను నిబంధనల ప్రకారం క్షుణ్ణం గా పరిశీలించాలని జిల్లా అదనపు కలెక్టర్ ఎం. డేవిడ్ సూచించా రు. కలెక్టరేట్లో నిర్వహించిన మీసేవ మొబైల్ వెరిఫికేషన్ యాప్ శిక్షణలో పాల్గొని
ఈ నెల 25 నుంచి యాప్ అమల్లోకి రానున్నందున మార్పులకు అనుగుణంగా సిద్ధంగా ఉండాలని, ఆదాయ ధ్రువీకరణ దరఖాస్తుల పరిశీలనలో పారదర్శకత పాటించాలని, గ్రామ పాలన అధికారులు విధులను బాధ్యతగా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఈడిస్ట్రిక్ట్ మేనేజర్ గౌతమ్‌రాజు పాల్గొన్నారు.